Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీపీపీ పనుల్లో ప్రమాదం... శ్లాబ్ కూలి ఏడీఈ మృతి, ఐదుగురికి గాయాలు

కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో కొద్దిసేపటి క్రితం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని ఆరో యూనిట్ నిర్మాణ పనుల వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న వారిపై ప్రాజెక్టు శ్లాబ్ విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఏడీఈ నాగేంద్ర అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.

More Telugu News